సిద్స్‌ ఫార్మ్‌ నూతన సీటీఓ సునీల్‌ పొత్తూరి

నూతన సీటీఓ సునీల్‌ పొత్తూరి చేరికతో తమ నాయకత్వ బృందాన్ని బలోపేతం చేసిన సిద్స్‌ ఫార్మ్‌
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ తమ నూతన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా సునీల్‌ పొత్తూరిని నియమించుకున్నట్లు వెల్లడించింది. కన్సల్టింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం సునీల్‌కు ఉంది.
సిద్స్‌ ఫార్మ్‌లో చేరక మునుపు సింటెలియో సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా వ్యవహరించిన ఆయన స్టార్టప్‌ సలహాదారునిగా కూడా గుర్తింపు పొందారు. కెరీర్‌ తొలినాళ్లలో లాస్‌ ఏంజెల్స్‌లోని డెలాయిట్‌లో కన్సల్టింగ్‌లో ఉద్యోగం చేసిన సునీల్‌ , టెక్నాలజీ , ఆపరేషన్స్‌ బృందాలకు నేతృత్వం వహించారు. అనంతర కాలంలో మీడియామింట్‌లో చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌గా డిజిటల్‌ మార్కెటింగ్‌, టెక్నాలజీ సేవలను అందించారు.
హైదరాబాద్‌లోని సీబీఐటీ లో ఇంజినీరింగ్‌ చేసిన సునీల్‌, అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేశారు.
సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్ధాపకుడు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ సునీల్‌ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలు, సాంకేతికత పట్ల అభిరుచి అత్యున్నత నాణ్యతకలిగిన ఉత్పత్తులు, సేవలు అందించాలనే తమ లక్ష్యంకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఆయన అనుభవం తమ భవిష్యత్‌ వృద్ధి, ఆవిష్కరణలలో కీలకం కానుందని వెల్లడించారు.
సునీల్‌ పొత్తూరి మాట్లాడుతూ సీటీఓగా సిద్స్‌ ఫార్మ్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు, సంస్థ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతిభావంతులైన సిద్స్‌ ఫార్మ్‌ టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా చూస్తున్నామన్నారు.

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్