![](https://techclubai.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-26-at-11.56.40-AM.jpeg)
కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడంలో ఆలస్యమెందుకు చేశారని హైకోర్టు ఆగ్రహం
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంచనివ్వడం లేదు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు చెక్కులు పంచకుండా ఆపుతున్నారని హైకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఈ నెల 27 వరకు చెక్కులు పంచకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని, త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేసిన పాడి కౌశిక్ రెడ్డి.
దీనిపై చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించిన హైకోర్టు.. చెక్కుల పంపిణీలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని అధికారులకు ఆదేశించిన హైకోర్టు.