చెన్నై ‘శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా’ ప్రారంభాన్ని ప్రకటించింది

శివ్ నాడర్ ఫౌండేషన్ వారి మొదటి ప్రయత్నము, శివ్ నాడర్ విశ్వవిద్యాలయము చెన్నై, శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా ను ప్రారంభించింది. ఆగస్ట్ 2024లో ప్రారంభం అయ్యే ఈ స్కూల్ అయిదు-సంవత్సరాల BA.LLB కోర్సును అందిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన ఈ లా స్కూల్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాల నుండి సుశిక్షితులైన ఫాకల్టీలు మరియు ప్రపంచ-స్థాయి మౌలికసదుపాయాలు ఉంటాయి. దీనితోపాటు, ఫాకల్టీలలో ఇరవై శాతంమంది ప్రస్తుతం క్రియాశీలక న్యాయవాద వృత్తిలో ఉన్నవారు మరియు ప్లేస్మెంట్ బృందానికి పరిశ్రమలో అనుభవము ఉంటుంది. ప్రారంభ బ్యాచ్ లో సుమారు 60 మంది విద్యార్థులను తీసుకోవాలని ఆశించబడుతోంది మరియు దరఖాస్తుదారులు https://apply.snuchennaiadmissions.com/application-form-for-school-of-law వద్ద నమోదు చేసుకోవచ్చు. ఈ కోర్సులో నమోదు చేసుకొనుటకు ఆఖరు తేది జులై 10, 2024.
శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా అన్ని సదుపాయాలు ఉన్న గ్రంధాలయాలు మరియు ప్రపంచ-స్థాయి పరిశోధన
సదుపాయాలు ఉన్న పచ్చటి ఎస్‎ఎన్యు చెన్నై ప్రాంగణములో స్థాపించబడింది. ఎస్‎ఎన్యు చెన్నై మేథో అన్వేషణ మరియు ఆవిష్కరణల కేంద్రము మరియు శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా భారతదేశము యొక్క ఉత్తమ న్యాయ వృత్తి నిపుణులు మరియు విద్వాంసులను తయారు చేయటానికి సిద్ధం అయ్యింది.
ప్రొ. శ్రీమాన్ కుమార్ భట్టాచార్య, ఉప-కులపతి, శివ్ నాడర్ విశ్వవిద్యాలయము, చెన్నై, ఇలా అన్నారు,”శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా ను ప్రారంభించుటకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఇది ఔత్సాహిక లీగల్ మైండ్స్ ను ప్రపంచ-స్థాయి న్యాయవాదులుగా తయారు చేస్తుంది. విద్యార్థులు విజయవంతమైన కెరీర్ కొరకు అవసరమైయ్యే విస్తృత పునాది మరియు వైవిధ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారని నిర్ధారించుటకు ఈ కోర్సు పాఠ్యప్రణాళిక ప్రపంచములోని ఉత్తమ ప్రాక్టీసుల ఆధారంగా నిర్మించబడింది. న్యాయపరమైన సమస్యల సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యములో, నాణ్యమైన లా స్కూల్స్ పాత్ర ఇదివరకటి కంటే చాలా కీలకంగా మారింది. ప్రతి విద్యార్థి ప్రపంచ-స్థాయి ఫాకల్టీ సభ్యుల నుండి మూలాధారమైన, వాస్తవికమైన మరియు విధానపరమైన న్యాయములో బలమైన పునాదిని పొందుతారని నిర్ధారించడానికి మేము కట్టుబడి ఉన్నాము.”
ప్రొ. శివప్రసాద్ స్వామినాథన్, డీన్ & ప్రొఫెసర్, శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా, ఇలా అన్నారు- ” చట్టపరమైన సిద్ధాంతాలలో నైపుణ్యం సాధించడం మాత్రమే కాకుండా విజయవంతమైన న్యాయవాద వృత్తిని చేపట్టుటకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను కూడా కలిగి ఉండేలాగా కొత్త తరం న్యాయవాదులను సృష్టించడం మా లక్ష్యం. శివ్ నాడర్ స్కూల్ ఆఫ్ లా విద్యార్థులు సంకుచితమైన భావాల నుండి మారి సమకాలీన మరియు భవిష్యత్ న్యాయపరమైన సవాళ్ళను పరిష్కరించుటకు అవసరమైన విధంగా సృజనాత్మకంగా ఆలోచించే ఒక రకమైన చట్టపరమైన సున్నితత్వం ఉండే నిశ్శబ్ద న్యాయ పరిజ్ఞానముపై ప్రాధాన్యత ఇస్తుంది .”
ప్రవేశ ప్రక్రియ: అభ్యర్ధులు CLAT and LSAT-ఇండియా స్కోర్స్ ద్వారా లేదా 10వ తరగతి మరియు 12వ తరగతి గ్రేడ్స్ ద్వారా ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక చేయబడిన విద్యార్థులు ఇంటర్వ్యూ కొరకు పిలువబడతారు.
ట్యూషన్ ఫీజు & స్కాలర్షిప్:
· భారతీయ విద్యార్థుల కొరకు: ఐఎన్‎ఆర్ 3,95,000/-
· NRI/OCI students ఎన్‎ఆర్‎ఐ/ఓసిఐ విద్యార్థులు : ఐఎన్‎ఆర్ 5,95,000/-
· విదేశీ విద్యార్థుల కొరకు : ఐఎన్‎ఆర్ 7,90,000/-
కొన్ని పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపులతో సహా, తమ బ్యాచ్ 2024 విద్యార్థులలో మూడవ వంతు విద్యార్థుల కొరకు ఈ స్కూల్ ఆర్థిక సహకారం అందించుటకు స్కాలర్షిప్ పథకాన్ని కూడా అందిస్తుంది.
ఇంటర్న్షిప్స్ మరియు ప్లేస్మెంట్స్: విద్యార్థులు అత్యధిక సమర్థత కలిగిన ప్లేస్మెంట్ బృందము నుండి వార్షిక ఇంటర్న్షిప్స్ మరియు సహకారము నుండి ప్రయోజనం పొందుతారు, తద్వారా వారిని తమ మొదటి ఉద్యోగము కొరకు మాత్రమే కాకుండా, జీవితకాలం కెరీర్ కొరకు కూడా సిద్ధం చేస్తారు.

Please follow and like us:
Pin Share

Related Posts

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్‌యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్‌ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…

Read more

Continue reading
కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ – పటాన్ చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. Please follow and like us:

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

కుక్కల దాడిలో బాలుడు మృతి

కుక్కల దాడిలో బాలుడు మృతి

గృహజ్యోతి స్కీమ్

గృహజ్యోతి స్కీమ్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు