‘డిస్నీ క్రూయిజ్ లైన్’ నౌకలో సముద్రయానం

సముద్రయానం చేయాలని అనుకునే వారికి ఇది శుభవార్తే. ఫ్యామిలీ అంతా ప్రయాణించడానికి వీలుగా డిస్నీ అడ్వెంచర్ వినోదకరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 లో సింగపూర్ నుంచి ఇది బయలదేరనుంది. ఈ డిస్నీ క్రూయిజ్ లైన్ నౌక ఆసియాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి బయలుదేరుతుంది. ఈ సముద్రయానం మూడున్నర రాత్రులు ఉంటుంది. ఈ నౌకా ప్రయాణంలో ఉద్విగ్న భరితమైన ఆనందం వినోదం లభించును.
మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారి ఈ డిస్నీ షిప్ ను ఆసియాలో ప్రవేశ పెడుతున్నామని డిస్నీ అడ్వెంచర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ షారోన్ సిస్కీ తెలిపారు. మా అతిథులకు ఎక్కువ సంతోషం, ఆనందం అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. డిస్నీ అడ్వెంచర్ నౌకలో ప్రయాణం చేసేటప్పుడు అతిథులు మునుపెన్నడూ లేని విధంగా డిస్నీ ఫిక్సర్, మార్వెల్ వంటి ప్రపంచాలకు అతిథులు వెళ్లి ఊహా లోకంలో విహరిస్తారని తెలిపారు. ఏదో తెలియని సంతోషానికి, అనుభూతికి గురవుతారన్నారు. మధుర జ్ఞాపకాలను తమ మనసులో ఎల్లప్పుడూ పదిలంగా దాచుకుంటారని తెలిపారు.
డిస్నీ అడ్వెంచర్ ప్రయాణంలో కనిపించే కొత్త ప్రదేశాలు
డిస్నీ అడ్వెంచర్ ఒక ప్రయాణమే కాక ఒక గమ్యస్థానం కూడా. మనకు ఈ సముద్ర యానం అవధులు లేని అనుభవాల్ని ఇస్తుంది. ఈ ప్రయాణంలో అతిథులు ఊహా లోకంలో విహరిస్తూ ఫాంటసీ, సాహసకృత్యాలు వంటి అనుభవాలను పొందుతారు. ఈ ఆనందకరమైన ప్రయాణంలో ప్రయాణికులు ఏడు రకాలైన ఆనందకరమైన, మర్చిపోలేని అనుభవాలను పొందుతారు. ఈ ప్రయాణం మన ఊహలకు ద్వారాలు తెరిచే ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. స్వాప్నికులు తమదైన కలలను కంటారు. ప్రయాణికులు ఊహల పల్లకిలో ఊహల తోటలో విహరిస్తున్నట్లు అనుభూతి చెందుతారు.
డిస్నీ ఊహ తోటలో హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అతి మనోహరమైన తోటలు, ఓపెన్ ఎయిర్ లో వివిధ రకాలైన వినోదకరమైన కార్యక్రమాలను మనం చూడవచ్చు. ఇవన్నీ ఒకే చోట లభిస్తాయి. వంద సంవత్సరాల వీరోచిత పాత్రలు మనకు దర్శనమిస్తాయి. మోయనా నుంచి అడవిలో మొగ్లీ వరకు సాహసాలు మనకు కనిపిస్తాయి. *అతిథులను* ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకొని వెళతాయి.
డిస్కవరీ రీఫ్ వద్ద కుటుంబ సభ్యులందరూ ఆటలు ఆడుకోవడం, షాపింగ్ చేయడం, కలిసి భోజనం చేసే వసతులు ఉంటాయి. దీనిలో డిస్నీ యానిమేషన్ స్టూడియో, ఫిక్సర్ యానిమేషన్ స్టూడియో కలవు. సముద్రయాన గాధలను ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ది లిటిల్ మెర్మైడ్, వారిలో స్టిచ్, ఫైండింగ్ నెమో, లూకా స్టూడియోలు అందుబాటులో ఉంటాయి. వరల్డ్ డిస్నీ యానిమేషన్ ప్రపంచంలో మనం బిగ్ హీరో సిక్స్, శాన్ ఫ్రాన్సిస్కో వీధులు మనకు గొప్ప ఆనందాన్ని కలగజేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మనకు లభిస్తుంది. వీధి మార్కెట్లు, గేమ్స్ ఇతర కార్యక్రమాలు షాపులు, సినిమాలు ఇంకా మరెన్నో మనకు దర్శనమిస్తాయి.
వే ఫైండర్ బే వద్ద – సముద్రం, ఆకాశం కలిసే ప్రాంతం మనం చూడగలం. సూర్యుని కింద ఉండే ఒయాసిసులను మనకు దర్శనమిస్తాయి. అక్కడ మనం సేద దీరగలం. పసిఫిక్ దీవులను మనం చూడగలం. డిస్నీ యానిమేషన్స్ మోయోనా మనకు అద్భుతమైన సముద్ర తీరా దృశ్యాలను కనువిందు చేస్తుంది.
మ్యాజిక్ ఆఫ్ ఫాంటసీ నందు మనకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అనేక కథలను మనం వినవచ్చును.
టౌన్ స్క్వేర్ నందు తమ కలలను సాకారం చేసుకునే అవకాశం లభించును. మన కలలు నిజమవుతాయి. ఈ ఊహ జనితమైన అటవీ ప్రాంతంలో మనం షాపులు, లాంజెస్, కేఫ్ , రెస్టారెంట్లు, వినోద స్థలాలను చూడవచ్చు. వేసవి కాల అనుభవాన్ని పొందవచ్చు. టేంగల్డ, సిండ్రెల్లా, ఫ్రోజెన్, స్నో వైట్, సెవెన్ డ్వార్ట్, ది ప్రిన్సైస్ అండ్ ది ఫ్రాగ్ వంటి ఎన్నో ఈవెంట్లు మనకు లభిస్తాయి
ప్రతి డిస్నీ అడ్వెంచర్ లో మనం ఆనందకరమైన ఉల్లాసకరమైన అనుభూతులను పొందుతాం.
మార్వెల్ లాండింగ్ వద్ద అన్ని వయసుల వారికి తమ అభిమాన హీరోలు తారసపడతారు. ఆకర్షణీయమైన ప్రదేశాలు మనం చూడగలం. ఒక కొత్త అనుభూతిని మనం పొందగలం.
టోయ్ స్టోరీస్ వద్ద ప్రయాణికులు ఆనందకరమైన అనుభవాన్ని పొందుతారు. వివిధ రకాలైన ఆటలు ఆడుకునే ప్రదేశాలు ఉంటాయి. వివిధ రకాలైన ఫుడ్ ప్రదేశాలు ఉంటాయి. నీటితో ఆడుకునే ఆటలు ఉంటాయి. చిన్న పిల్లలకు సినిమాలు ప్రదర్శన ఉంటుంది.

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్