![](https://techclubai.com/wp-content/uploads/2024/06/hhdh.jpg)
మహిళా పోలీసుతో అక్రమసంబంధం.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోషన్
యూపీకి చెందిన క్రిపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు.. కానీ కృపా శంకర్ మూడేళ్ల క్రితం ఓ మహిళా కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
అతని భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేయగా ఇద్దరూ హోటల్లో పట్టుబడ్డారు. దీనిపై ఇటీవల విచారణను పూర్తి చేసిన డిపార్ట్మెంట్.. అతణ్ని కానిస్టేబుల్‌గా డిమోట్ చేసింది.