నగదు బోనస్ 43% అధికం, టెర్మినల్ బోనస్ 49% అధికం

ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (FGILI) ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా రూ. 59.80 కోట్ల బోనస్ ప్రకటించింది. దీనివల్ల పార్టిసిపేటింగ్ ప్రోడక్టులలో పెట్టుబడులు పెట్టిన 1,01,000 మందికి పైగా పాలసీదారులకు ప్రయోజనం లభించగలదు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సర బోనస్ 12 శాతం అధికం కావడం గమనార్హం. నగదు బోనస్ గణనీయంగా 43% పెరిగి రూ. 14.60 కోట్లకు చేరగా, టెర్మినల్ బోనస్ కూడా గణనీయంగా 49 శాతం పెరిగి రూ. 4.54 కోట్లకు చేరింది.
2024 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా ప్రీమియం చెల్లించిన పాలసీలు లేదా ఫుల్లీ పెయిడ్ పాలసీలకు అదనంగా, నిర్దిష్ట అర్హతా ప్రమాణాలను బట్టి, రెడ్యూస్డ్ పెయిడప్ స్టేటస్ నుంచి నిష్క్రమించే పాలసీదారులకు టెర్మినల్ బోనస్‌లను మంజూరు చేసే విధానాన్ని FGILI అమల్లోకి తెచ్చింది.
“అత్యధిక పార్టిసిపేటింగ్ బోనస్ ప్రకటించడమనేది మా పటిష్టమైన ఆర్థిక పరిస్థితికి నిదర్శనం. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాల సాధనలో కస్టమర్లకు తోడ్పాటు అందించాలన్న మా నిబద్ధత మేము అనుసరించే విధానాలన్నింటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వార్షిక ప్రాతిపదికన, జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు తోడ్పడే మా ప్రత్యేక పెట్టుబడి వ్యూహాలకు అనుగుణమైన వేల్యూ-ప్యాక్డ్ ప్రోడక్టులను కస్టమర్లకు అందిస్తున్నాం” అని బోనస్‌ను ప్రకటించిన సందర్భంగా ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ & సీఈఓ అలోక్ రుంగ్టా తెలిపారు.
పాలసీదారుకు బీమా సంస్థలు బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అదనంగా అందించే మొత్తాన్ని బోనస్‌గా పరిగణిస్తారు. జీవిత బీమా సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఈ బోనస్‌ల కోసం కేటాయిస్తుంటాయి. మార్కెట్ ఆధారిత ప్రోడక్టులతో పోలిస్తే ఈ పార్టిసిపేటింగ్ పాలసీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్కులు తగ్గి వినియోగదారులు తమ పెట్టుబడులను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. పాలసీలో నగదు బోనస్‌లు ఉండటం వల్ల లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. అలాగే వినియోగదారులు తమ సంపదను పెంచుకునేందుకు వీలుంటుంది. పాలసీ వ్యవధి చివరి వరకు జీవిత బీమా కవరేజీకి అదనంగా లభించే ఈ బోనస్‌లు, పాలసీదారులకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చగలవు.

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్