సిండ్రోమ్‌ తో బాధపడుతున్న టీనేజ్ అమ్మాయికి చికిత్స

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలికకు యుక్త వయస్సు వచ్చినప్పటికీ రుతుక్రమం ప్రారంభం కాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆంధ్రాలోని ఒక స్థానిక ఆసుపత్రిలో ఆమెను చూపించారు. అక్కడ ఆమె సమస్యను గుర్తించ లేకపోవటం తో వారు తమ కుమార్తెను మదర్‌హుడ్ ఆసుపత్రి బెంగుళూరుకు పరీక్ష కోసం తీసుకువచ్చారు. అక్కడ ఆమెకు ఎంఆర్ కెహెచ్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎంఆర్ కెహెచ్ సిండ్రోమ్ అనేది పుట్టుకతోనే మహిళల్లో జననేంద్రియాలు , గర్భాశయం మరియు/లేదా ఫెలోపియన్ ట్యూబ్‌లు లేకపోవడం లేదా అభివృద్ధి చెందకపోవడం వంటి అరుదైన పరిస్థితి. సాధారణంగా యుక్తవయస్సు వచ్చే వరకు ఇది నిర్ధారణ చేయబడదు. ఇది 4,500-5000 స్త్రీ జననాలలో ఒకరికి సంభవించే అరుదైన పరిస్థితి.
Mayer-Rokitansky-Küster-Hauser (ఎంఆర్ కెహెచ్ ) సిండ్రోమ్ ఉన్న స్త్రీలు వైద్య మరియు మానసిక అవరోధాలతో బాధపడుతున్నారు. గర్భాశయం లేకపోవడం వల్ల వీరికి పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు. వారికి వాజినోప్లాస్టీ వంటి శస్త్ర చికిత్సలు అవసరం కావచ్చు.
మదర్‌హుడ్ హాస్పిటల్‌లో, సమగ్రమైన కటి పరీక్ష, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్, ఎంఆర్ఐ, జన్యు పరీక్ష మరియు హార్మోన్ల అంచనాలతో సహా సమగ్ర పరీక్షలు చేయటం జరిగింది. ఈ రోగనిర్ధారణ పద్ధతుల ద్వారా, సాధారణ బాహ్య జననేంద్రియాలు మరియు అండాశయ పనితీరు ఉన్నప్పటికీ బాలికకు గర్భాశయం మరియు యోని లేకపోవడం లేదా అభివృద్ధి చెందకపోవడాన్ని వారు నిర్ధారించగలిగారు.
డాక్టర్ కవిత జి పూజర్, కన్సల్టెంట్ – ప్రసూతి నిపుణురాలు , గైనకాలజిస్ట్ మరియు వంధ్యత్వ నిపుణులు , మదర్‌హుడ్ హాస్పిటల్స్, హెచ్‌ఆర్‌బిఆర్ లేఅవుట్ మాట్లాడుతూ “ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎంఆర్‌కెహెచ్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. ఇది పూర్తిగా ఏర్పడిన బాహ్య జననేంద్రియాలు మరియు అండాశయాల పనితీరు ఉన్నప్పటికీ గర్భాశయం అభివృద్ధి చెందకపోవడం లేదా లేకపోవడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఎంఆర్‌కెహెచ్ సిండ్రోమ్ సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తుంది. తమ కుమార్తె స్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. అయినప్పటికీ, ఆమె తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని త్వరలో ప్రారంభించనున్నందున వారు ఆమె విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆమె విద్యను పూర్తి చేసిన తర్వాత వైద్య ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని వారు భావిస్తున్నారు. వాజినోప్లాస్టీ విధానం అనేది ఒక కొత్త యోని ఛానెల్‌ని సృష్టించడాన్ని సూచిస్తుంది, ఇది ఖచ్చితంగా ఆమె జీవన నాణ్యతను మెరుగుపరిచే మరియు మరింత సాధారణ జీవితాన్ని గడపడానికి అనుమతించే ఒక ఆచరణీయ ఎంపిక” అని అన్నారు.
డాక్టర్ కవితా జి పూజర్ ఇంకా చెబుతూ “ఈ తరహా సమస్యలు ఉన్నప్పటికీ, సంతానోత్పత్తి సంరక్షణ చికిత్స మరియు ఊసైట్ రిట్రీవల్ లేదా సరోగసీ వంటి పద్ధతులు బయలాజికల్ గా మాతృత్వంకు అవకాశం కల్పిస్తాయి. స్టెమ్ సెల్స్ మరియు రీజెనరేటివ్ మెడిసిన్‌లో కొనసాగుతున్న శాస్త్రీయ పరిశోధనలు భవిష్యత్తులో కొత్త సంతానోత్పత్తి చికిత్సలను అందించే అవకాశం ఉంది” అని అన్నారు.

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్