హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్ అధినేతలను సత్కరించిన ఓయో

*హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్ అధినేతలను సత్కరించిన ఓయోహైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్ అధినేతలను సత్కరించిన ఓయో
* మెరుగైన పనితీరు కనబరిచిన అగ్రశ్రేణి హోటళ్ల అధినేతలను హోటల్ ఈస్టిన్‌లో ఓయో సత్కరించింది
· దేశం నలుమూలల నుండి 100 మందికి పైగా హోటల్ యజమానులు హోటల్ రంగానికి అందించిన తమ అసాధారణమైన సహకారానికి సర్టిఫికేట్‌లను అందుకున్నారు
· ఈ ఈవెంట్ ఒక గొప్ప వేడుకగా, ఒక గాలా డిన్నర్, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు నెట్‌వర్కింగ్ మరియు సహకారం కోసం అవకాశాలతో జరిగింది.
గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ, ఓయో, హైదరాబాద్‌లోని హోటల్ ఈస్టిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన తమ హోటల్ భాగస్వాములను సత్కరించింది.దేశవ్యాప్తంగా 100 మందికి పైగా హోటళ్ల వ్యాపారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో చాలా వరకు ఓయో యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్నారు. ఓయో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ మొదటి తరం హోటళ్ల యజమానులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రోత్సహిస్తుంది
ఈ కార్యక్రమంలో, ఓయో యొక్క సీనియర్ లీడర్‌షిప్ టీమ్, చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్‌తో సహా; వరుణ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ఆశిష్ లాబ్రూ, హెడ్, సప్లై స్ట్రాటజీ, రెవెన్యూ అండ్ మార్జిన్స్ మరియు నితిన్ ఠాకూర్, గ్లోబల్ హెడ్, స్ట్రాటజిక్ అలయన్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆశిష్ సౌరభ్, రీజియన్ హెడ్, సౌత్, ఇతర టాప్ మేనేజ్‌మెంట్ హోటళ్ల యజమానులను సత్కరించేందుకు హాజరయ్యారు. ఓయో యొక్క అతిథులు అధిక-నాణ్యత కలిగిన , సరసమైన వసతిని ఆస్వాదించేలా చూసేందుకు హోటల్ భాగస్వాములు అందిస్తున్న అచంచలమైన మద్దతు మరియు చూపుతున్న అంకితభావానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
టిప్సీ ఇన్ సూట్స్ హెడ్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ “నేను ప్రస్తుతం గుర్గావ్‌లో 10 హోటళ్లను నిర్వహిస్తున్నాను. త్వరలోనే జైపూర్, రిషికేశ్, ముస్సోరీస్ మరియు కేదార్‌నాథ్ వంటి ఇతర నగరాలకు విస్తరించేందుకు ప్రణాళిక చేస్తున్నాను. తద్వారా మరింత మంది అతిథుల అవసరాలు తీర్చగలము. ఓయో ఫోకస్‌తో కూడా సరిపోయే ఈ ప్రయాణంలో నేను ప్రీమియం ప్రాపర్టీలపై దృష్టి సారిస్తున్నాము” అని అన్నారు.
ఓయో తమ హోటల్ భాగస్వాములకు మద్దతు ఇస్తూనే యాత్రికులకు నాణ్యమైన వసతిని అందించడంలో నిబద్ధత చూపుతూ, ప్రపంచ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌గా దాని వృద్ధిని ముందుకు తీసుకెళ్లింది. సంస్థ యొక్క బలమైన ప్లాట్‌ఫారమ్, సాంకేతికతతో నడిచే పరిష్కారాలు మరియు అతిథులు మరియు భాగస్వాములు ఇద్దరికీ సౌకర్యవంతమైన అనుభవాన్ని సృష్టించే అంకితభావం ఈ విజయాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయి.

Please follow and like us:
Pin Share

Related Posts

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్‌యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్‌ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…

Read more

Continue reading
కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ – పటాన్ చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. Please follow and like us:

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

కుక్కల దాడిలో బాలుడు మృతి

కుక్కల దాడిలో బాలుడు మృతి

గృహజ్యోతి స్కీమ్

గృహజ్యోతి స్కీమ్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు