నీట్ యుజి 2024లో టాప్ స్కోరర్లు గా నిలిచిన 15 మంది హైదరాబాద్‌కు చెందిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) విద్యార్థులు

హైదరాబాద్, జూన్ 05, 2024: టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామి అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్), ప్రతిష్టాత్మకమైన నీట్ యుజి  2024 పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన 15 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చేశారని సగర్వంగా వెల్లడించింది. ఈ విద్యార్థులలో అధికశాతం మంది 679 మరియు అంతకంటే ఎక్కువ స్కోర్‌లు సాధించారు. ఈ అద్భుతమైన ఫీట్ వారి కృషి, అంకితభావం మరియు ఏఈఎస్ఎల్ అందించిన అధిక-నాణ్యత కలిగిన కోచింగ్‌కు నిదర్శనం. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.

అనురన్ ఘోష్ 716 స్కోర్ చేయడం ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్ ( ఏఐఆర్)  77, సాయి ప్రణవ్ లకినపల్లి  711  స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 306 , రిజ్వాన్ షేక్  710 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 549 , జయంత్ 706 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 755 , అరూష్ దధీచ్ 705 స్కోర్ చేయడం ద్వారా ఏఐఆర్ 1391  , మరియు కె  సర్వజ్ఞ  705 స్కోర్ చేయడం ద్వారా  ఏఐఆర్ 856 సాధించటం తో పాటుగా మరెంతో మంది విద్యార్థులు మెరుగైన ర్యాంక్ లు సాధించారు. 

విద్యార్థులు నీట్  కోసం సిద్ధం కావడానికి ఏఈఎస్ఎల్ యొక్క తరగతి గది ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నారు,  ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా నీట్  పరిగణించబడుతుంది.  తమ అద్భుతమైన విజయానికి కాన్సెప్ట్‌ల పట్ల మెరుగైన అవగాహన మరియు క్రమశిక్షణతో కూడిన అధ్యయన షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించడం వల్లనే   సాధ్యమైనదని వారు వెల్లడించారు. “ఆకాష్ మాకు రెండు విధాలా  సహాయం చేసినందుకు మేము కృతజ్ఞులం.  ఏఈఎస్ఎల్ కంటెంట్ మరియు కోచింగ్ లేకుండా , మేము తక్కువ సమయంలో వివిధ సబ్జెక్టులలో అనేక కాన్సెప్ట్ల ను గ్రహించలేము” అని విద్యార్థులు తెలిపారు.

అసాధారణ విజయాన్ని సాధించినందుకు విద్యార్థులను అభినందించిన , ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) చీఫ్ అకడమిక్ , బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, “విద్యార్థులు సాధించిన  ఆదర్శప్రాయమైన ఫీట్‌కి మేము వారిని అభినందిస్తున్నాము. 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ 2024కి హాజరయ్యారు. వీరు సాధించిన విజయం, వారి కృషి మరియు అంకితభావంతో పాటు వారి తల్లిదండ్రుల మద్దతు గురించి ఎంతో చెబుతుంది. భవిష్యత్ లో వీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తున్నాను” అని అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ (MBBS), డెంటల్ (BDS) మరియు ఆయుష్ (BAMS, BUMS, BHMS, మొదలైనవి) కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు  భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో, విదేశాలలో ప్రాథమిక వైద్య అర్హతను పొందాలనుకునే వారికి అర్హత పరీక్షగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్ నిర్వహిస్తుంది. 

Please follow and like us:
Pin Share

Related Posts

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సదుపాయాన్ని ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా తమ కస్టమర్లతో పాటు కస్టమర్‌యేతరులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN 2.0 ప్లాట్‌ఫాం ద్వారా బ్యాంకు ఈ వసూళ్ల సేవలను…

Read more

Continue reading
కుక్కల దాడిలో బాలుడు మృతి

హైదరాబాద్ – పటాన్ చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. Please follow and like us:

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

పన్నుల వసూళ్ల సేవలు ప్రారంభించిన బంధన్ బ్యాంక్

కుక్కల దాడిలో బాలుడు మృతి

కుక్కల దాడిలో బాలుడు మృతి

గృహజ్యోతి స్కీమ్

గృహజ్యోతి స్కీమ్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

మార్కెట్‌లో దూసుకెళుతున్న టాటా మోటార్స్

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 10న శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు

జూలై 4 నుండి 7 వరకుప్లాస్టిక్ రీసైక్లింగ్అంతర్జాతీయ సదస్సు