INR 23990 వద్ద ప్రారంభించిన శామ్­­సంగ్

శామ్­­సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ హై-ఫిడిలిటీ స్పీకర్ యొక్క సౌందర్య ఆకర్షణను ఫోటో డిస్‌ప్లే యొక్క కార్యాచరణతో కలపడం ద్వారా ఆధునిక గృహాలకు మెరుగులద్దుతూ, కస్టమర్‌లు వ్యక్తిగత ఫోటోలను వీక్షించేటప్పుడు సంగీతాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.
గురుగ్రామ్, ఇండియా – జూన్ 25, 2024: శామ్­­సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఈరోజు భారతదేశంలో తన మ్యూజిక్ ఫ్రేమ్‌ను ఆవిష్కరించింది. వైర్‌లెస్ స్పీకర్ ఒక కళాఖండం వలె కనిపిస్తుంది ఈ మ్యూజిక్ ఫ్రేమ్ డాల్బీ అట్మోస్ మరియు వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి కొత్త ఫీచర్‌లతో కేవలం INR 23,990 వద్ద లభిస్తుంది.
స్టైలిష్ వైర్‌లెస్ స్పీకర్ను పిక్చర్ ఫ్రేమ్‌గా చేయడం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా లివింగ్ రూమ్‌లో చక్కగా సరిపోతుంది. నిజమైన ఫ్రేమ్ వలె శామ్­సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్, వినియోగదారులు వారి ఫోటోలను పెట్టుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. విలువైన జ్ఞాపకం లేదా కళాఖండం యొక్క ఫ్రేమ్డ్ ఫోటోను చూస్తూ సంగీతాన్ని వినడం వినియోగదారుల అనుభవాలకు కొత్త స్థాయిలను జోడిస్తుంది.
శామ్­­సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్ ఈరోజు నుండి Samsung.in మరియు Amazon.in మరియు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
“ఆధునిక వినియోగదారులు కార్యాచరణ మరియు సౌందర్యాన్ని మిళితం చేయడమే కాకుండా, దృశ్యమాన ఆకర్షణను కూడా జోడించే ఉత్పత్తులను ఎక్కువగా కోరుకుంటున్నారు. వారి లివింగ్ రూమ్ యొక్క వాతావరణాన్ని మెరుగుపరచడంతోపాటు వారి వ్యక్తిత్వాన్ని మరియు శైలిని వ్యక్తీకరించే వస్తువుల అవసరం ఈ ట్రెండును ముందుకు తీసుకెళుతుంది. “కొత్త మ్యూజిక్ ఫ్రేమ్ అద్భుతమైన సాంకేతికతను కలిగి ఉండటంతో, ఇది సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందిస్తూనే దాని విలక్షణమైన, సొగసైన డిజైన్‌తో పిక్చర్ ఫ్రేమ్ రూపంలో ఆడియోను అందిస్తుంది,” అని మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్,
విజువల్ డిస్‌ప్లే బిజినెస్, శామ్‌సంగ్ ఇండియా అన్నారు.
మ్యూజిక్ ఫ్రేమ్ వినియోగదారులకు వైర్-రహితంగా మ్యూజిక్ ను ఆస్వాదించే సౌలభ్యాన్ని అందిస్తుంది, అదే సమయంలో రిచ్, క్లియర్ ఆడియోతో ఏదైనా స్థలాన్ని నింపే అత్యుత్తమ ధ్వని నాణ్యతను అందిస్తుంది. దాని వ్యక్తిగతీకరించిన, ఫ్రేమ్డ్ ఆర్ట్‌వర్క్ హోమ్ డెకర్‌ను మెరుగుపరుస్తుంది, ఇది లివింగ్ రూమ్­­లను మరింత ఆహ్లాదంగా చేయడానికిడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలనే శామ్‌సంగ్ అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఇది ఏ ఇంటికి అయినా ఒక శక్తివంతమైన జోడింపుగా ఉంటుంది, అద్భుతమైన విజువల్ అప్పీల్ మరియు అద్భుతమైన ఆడియో పనితీరును అన్నింటిని ఒకే సొగసైన పరికరంలో అందిస్తుంది.

Please follow and like us:
Pin Share

Related Posts

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు. పొడిచింది ఎవరో కాదు కోమటిరెడ్డి! జగన్ లోటస్ పాండ్ వద్ద కట్టడం కూల్చివేత చేయించింది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే.. స్వయంగా చెప్పిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో జగన్…

Read more

Continue reading
గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,…

Read more

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

జగన్‌కి వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ధర్మపురి శ్రీనివాస్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

బరువు తగ్గడం కోసం 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

హెచ్‌డీఎఫ్‌సీ అర్గోతో కలిసి ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్ ఆవిష్కరించిన ట్రూకాలర్‌

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

మొక్కల పోషకాహార ఉత్పత్తులను విడుదల చేసిన శ్రీరామ్ ఫార్మ్

రైతులకు అధునాతన పడ్లింగ్ సాధికారత కల్పిస్తున్న స్వరాజ్

రైతులకు అధునాతన పడ్లింగ్  సాధికారత కల్పిస్తున్న స్వరాజ్